Telangana: అత్యంత అరుదైనది.. అందమైనది.. కొంపదీసి తినేరు.. ఖతం అంతే..
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్లో అత్యంత అరుదైన 'క్లార్కిఇండా ట్రాకోడెస్' అనే అడవి పుట్టగొడుగును గార్డెన్ సమన్వయకర్త డా. బి. సదాశివయ్య గుర్తించారు. అగారికేసి కుటుంబానికి చెందిన ఈ పుట్టగొడుగు తెలంగాణ రాష్ట్రంలో నమోదవడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. జీవవైవిధ్య పరిశోధనలో భాగంగా నిర్వహించిన పరిశీలనల్లో ఈ పుట్టగొడుగు కనిపించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ శిలీంద్ర శాస్త్రవేత్త ప్రొఫెసర్ మనోహరాచారి…
