
అమరావతి, మే 6: రాష్ట్రంలో 290 డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి 2023 డిసెంబరులో ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2025 జులైలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించింది. రిజర్వేషన్ రోస్టర్‌పై గందరగోళ నెలకొనడంతో స్పష్టత కోరుతూ గతేడాది నవంబరులో ఉన్నత విద్య కమిషనరేట్‌కు ఏపీపీఎస్సీ ఉత్తర్వులు పంపింది. దీనిపై ఉన్నత విద్య కమిషన్ నివేదికను ఇటీవల ఏపీపీఎస్సీకి పంపింది. దీంతో ఫలితాలు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు వేతనంగా చెల్లిస్తారు.
సబ్జెక్టుల వారీగా పోస్టుల ఖాళీలు..
- బయోటెక్నాలజీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 4
- బోటనీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 20
- కెమిస్ట్రీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 23
- కామర్స్ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 40
- కంప్యూటర్ అప్లికేషన్స్ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 49
- కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 48
- ఎకనామిక్స్ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 15
- ఇంగ్లిష్ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 5
- హిస్టరీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 15
- మేథమేటిక్స్ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 25
- మైక్రోబయోలజీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 4
- పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 15
- తెలుగు సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 7
- జువాలజీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 20
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
