బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన భద్రతను గణనీయంగా పెంచుకున్నారు. ముంబైలోని తన నివాసం ‘జల్సా’ వెలుపల ప్రతి ఆదివారం అభిమానులకు అభివాదం చేయడం ఆయనకు అనవాయితీ. అయితే, తాజాగా ఆయన బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ స్క్రీన్ వెనుక నుంచి కనిపించడం చర్చనీయాంశమైంది. అమితాబ్ నివాసానికి బాంబు బెదిరింపులు రావడం, మరోవైపు నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన జరగడంతో ఈ అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 23న ముంబై మేయర్‌కు అందిన ఈ-మెయిల్‌లో అమితాబ్ నివాసం ‘జల్సా’పై దాడి చేస్తామని దుండగులు హెచ్చరించారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 మధ్య ఈ దాడి జరగవచ్చని పేర్కొనడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దీనికి తోడు, జుహూ ప్రాంతంలో నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. దర్యాప్తులో భాగంగా నిందితులు.. అమితాబ్‌తో పాటు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి అగ్ర నటుల ఇళ్ల వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి సుమారు 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో అమితాబ్ తన భద్రతపై కఠిన చర్యలు తీసుకున్నారు. సాధారణంగా అభిమానులకు నేరుగా కనిపించే ఆయన, ఇప్పుడు చక్రాలున్న పీఠం చుట్టూ బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌ను ఏర్పాటు చేయించుకున్నారు. ఈ భద్రతా ఏర్పాట్లు పోలీసుల సూచనల మేరకే జరిగినట్లు తెలుస్తోంది. ఏదేమైనా బాలీవుడ్‌ను కమ్మేసిన ఈ భద్రతాపరమైన ఆందోళనలు సర్వత్రా కలకలం రేపుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shah Rukh Khan: మన హైదరాబాద్ బిడ్డ బాలీవుడ్ ను ఎలా గెలిచాడు
Bigg Boss Rohit: సడెన్ ఎలిమినేషనే కాదు.. రెమ్యునరేషన్‌లోనూ నిరాశే!
అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు..
