టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం హాస్యనటుడిగా కామెడీ సినిమాలే కాకుండా సీరియస్ పాత్రలతో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలతో మెప్పించారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల రంభ ఊర్వశి మేనక సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే మహేష్ బాబుతో నటించిన మహర్షి సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు తనను ఓ టాలీవుడ్ స్టార్ హీరో సూచించారని.. ఆయన తన యాక్టింగ్ నమ్మారని అన్నారు. ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరి నుంచి తన నటనపై ప్రశంసలు వచ్చాయని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..
“మహర్షి” చిత్రం నటుడు నరేష్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం నరేష్‌ను సంప్రదించినప్పుడు, ఆయన మొదట మహేష్ బాబు స్నేహితుడి పాత్రలో కామెడీ చేస్తానని భావించినట్లు తెలిపారు. సాధారణంగా హాస్యనటులు హీరోలుగా మారుతున్న సమయంలో, తనను కామెడీ చేయించడానికి కాకుండా, ఒక కీలక పాత్రకు ఎంపిక చేయడం పట్ల ఆశ్చర్యపోయానని అన్నారు. ఈ పాత్రకు మహేష్ బాబు స్వయంగా నరేష్ పేరును సూచించారని, ఇది ఆయన నటనపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..
సినిమా విడుదలైన తర్వాత, తన నటనకు అద్భుతమైన స్పందన లభించిందని అన్నారు. చాలా మంది ప్రేక్షకులు ఆయనను నవ్విస్తారని భావిస్తే, ఆయన తన నటనతో వారిని ఏడిపించారని ప్రశంసించినట్లు గుర్తు చేసుకున్నారు. అప్పటివరకు కామెడీ చిత్రాలలో హాస్యాన్ని మెచ్చుకున్న ప్రేక్షకులు, “మహర్షి” తరువాత నరేష్ లోతైన, భావోద్వేగ నటనను ప్రత్యేకంగా అభినందించారని చెప్పుకోచ్చారు. ఈ సినిమాతో ప్రేక్షకులు హాస్య పాత్రలతో పాటు పరిణతి చెందిన, సీరియస్ పాత్రలలో కూడా తనను ఆమోదిస్తున్నారని నరేష్ గుర్తించారు. ఈ అనుభవం తరువాత, ఆయన సాధారణ, రొటీన్ చిత్రాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు, ఇది ఆయన కెరీర్ ఎంపికలలో ఒక మలుపుగా మారింది.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..
మహేష్ బాబు పోస్ట్..
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..
