తాజావార్తలు

Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. మహిళలకు గుడ్‌న్యూస్‌..తులం బంగారం ధర ఎంతంటే..!

Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. మహిళలకు గుడ్‌న్యూస్‌..తులం బంగారం ధర ఎంతంటే..!


Gold, Silver Prices Today: ప్రస్తుతం దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన రెండు లోహాల ధరలు.. ఇప్పుడు క్రమంగా దిగి వస్తున్నాయి. ధరలు తగ్గడం మహిళలకు కొంత ఉపశమనం కలిగించినట్లే. అయితే దేశీయ మార్కెట్లో గత మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఏప్రిల్‌ 28న కూడా స్వల్పంగా తగ్గాయి. గత వారం రోజులుగా భారీగా తగ్గిన ధరలు ఒక్కసారి మాత్రమే పెరిగాయి. అంటే ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరగడం, క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డ్ స్థాయిలోనే ఉండడం వంటివి బంగారం ధరలు తగ్గేందుకు కారణమవుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నెలలో 24న బంగారం ధరలు కాస్త పెరిగినట్లు కనిపించినా రికార్డ్ గరిష్ఠాలకు చాలా దూరంగానే ఉన్నాయి. తాజాగా దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  • హైదరాబాద్‌- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,700 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,890 ఉంది.
  • విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,700 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,890 ఉంది.
  • ఢిల్లీ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,850 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,040 ఉంది.
  • చెన్నై – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,250 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,310 ఉంది.
  • బెంగళూరు – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,700 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,890 ఉంది.
  • కోల్‌కతా – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,700 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,890 ఉంది.
  • కేరళ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,700 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,890 ఉంది.

వెండి ధరలు (కిలోకు)

  • హైదరాబాద్‌ – రూ.2,69,900
  • ఢిల్లీ – రూ.2,59,900
  • చెన్నై – రూ.2,69,900
  • కేరళ – రూ.2,69,900
  • ముంబై – రూ.2,59,900
  • బెంగళూరు – రూ.2,59,900
  • కోల్‌కతా – రూ.2,59,900

ధరల్లో మార్పులకు కారణాలు:

అంతర్జాతీయ మార్కెట్: ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువలో మార్పులు మరియు భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం పసిడి ధరలపై పడుతోంది. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అలాగే జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు, రాష్ట్రాల వారీగా ఉండే రవాణా ఖర్చుల వల్ల నగరాల మధ్య ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి.

సూచన: పైన పేర్కొన్న ధరలు కేవలం సమాచారం కోసం మాత్రమే. కొనుగోలు చేసే ముందు మీ స్థానిక జ్యువెలరీ షాపులో ఖచ్చితమైన ధరలను సరిచూసుకోగలరు. ఎందుకంటే ప్రాంతాలను బట్టి ధరల్‌లో తేడా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *