జ్యోతిష్య శాస్త్రంలో సాముద్రిక శాస్త్రానికి కూడా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. ఇక సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కన్ను అదరడం కూడా కొన్ని సార్లు శుభ , అశుభ ఫలితాలను కలిగిస్తుంది. కాగా, ఇప్పుడు మనం సాముద్రిక శాస్త్రం ప్రకారం, మగ వారికి ఏ కన్ను అదరడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మగవారికి కుడి కన్ను అదరడం చాలా మంచిది. ఏ వ్యక్తికి అయితే పదే పదే కుడి కన్ను అదురుతుందో అతనికి అదృష్టం కలిసి వస్తుందంట. అంతే కాకుండా అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు.
మగవారికి కుడి కన్ను అదరడం వలన ఆ వ్యక్తి ఆ రోజు శుభ వార్తలు వినడం లేదా, ఆకస్మిక ధనలాభం కలగడం లేదా ఉద్యోగ పరంగా మంచి ప్రమోషన్ అందుకోవడం, లేదా వివాహాది శుభకార్యాలు ఫిక్స్ అవ్వడం, జాబ్ వ చ్చే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు పండితులు. అందుకే మగవారికి కుడి కన్ను అదరడం చాలా మంచిదంట.
అదే విధంగా మగవారికి ఏడుమ కన్ను అదరడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. మగవారికి ఏడమ కన్ను అదరడం దురదృష్టానికి సంకేతం. ఇది అనేక ఇబ్బందులు, సమస్యలకు కారణం అవుతుందంట. అంతే కాకుండా కొన్ని సార్లు రాబోయే విపత్తులను కూడా ఇది సూచిస్తుందంట. అందుకే చాలా మంది మగవారికి కుడి కన్ను అదరకూడదు అని చెబుతుంటారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు





