తాజావార్తలు

Horoscope Today: వీరు ఎంత కష్టపడినా వృథా.. 12 రాశుల వారికి రాశిఫలాలు ఇలా

Horoscope Today: వీరు ఎంత కష్టపడినా వృథా.. 12 రాశుల వారికి రాశిఫలాలు ఇలా


Horoscope Today: వీరు ఎంత కష్టపడినా వృథా.. 12 రాశుల వారికి రాశిఫలాలు ఇలా

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఆసి్, ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సహాయాన్ని కూడా తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో అంచనాలను మించి లాభాలు అందుకుం టారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కార మవు తాయి. కుటుంబ సమస్యలు చాలావరకు సమసిపోతాయి. పిల్లల విషయంలోశుభవార్త వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులతో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా చక్కబడతాయి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలున్నా ముఖ్యమైన పనుల్ని పట్టు దలగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో లక్ష్యాలు, బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో మరింత మెరుగైన పరిస్థితు లుంటయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఎక్కువగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్ప డతాయి. నిరుద్యోగులకు ఆశించిన విదేశీ సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి  ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగులకు కొద్దిగా అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా మంచిది. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యో గులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసిదైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వ్యాపారాలలో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ పెద్దలతో సానుకూలంగా, సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

జీతభత్యాల విషయంలో ఉద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహ కరంగా సాగుతాయి. కొందరు ఇష్టమైన బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగుల ప్రయ త్నాలు సక్సెస్ అవుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. రుణ సమస్యలు తగ్గుతాయి. గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆర్థిక లావాదేవీలు లాభాలనిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. అధికారులు ఎంతో నమ్మకంతో కొన్ని అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆదాయానికి, ఆరో గ్యానికి ఢోకా ఉండదు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ప్రయాణాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. కుటుంబ జీవితంలో కొన్ని చికాకులు తప్పవు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కాస్తంత ఉప శమనం లభిస్తుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి.  

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలు బాగా ఉత్సాహంగా పురోగమిస్తాయి. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు, ఆలోచనలు అమలు చేస్తారు. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించి ఆలోచనలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. సమాజంలో పెద్దల పరిచయాలు విస్తృతం అవుతాయి. పిల్లల చదు వులకు సంబంధించి కొత్త అవకాశాలు అందుతాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందు కుంటారు. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. వృథా ఖర్చులు తగ్గించుకోవాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రోజంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగు తాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసు కుంటారు. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. బంధువుల నుంచి ఆశించిన శుభ వార్త వింటారు. తల్లితండ్రుల సహాయంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు.  ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబంతో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంటి విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు. బంధువులు అపనిందలు వేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *