
మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి ఆంజనేయ స్వామి భక్తుడు. తన ప్రతి పనిలోనూ హనుమంతుడి ఆశీస్సులు ఉంటాయని ఆయన బలంగా నమ్ముతుంటారు. చిరంజీవి మాతృమూర్తి పేరు అంజనా దేవి కాగా, తన ఇంటికి ఏకంగా అంజనాద్రి అని పేరు పెట్టుకున్నారు మెగాస్టార్ ఇదిలా ఉంటే ఇవాళ (ఏప్రిల్ 02) హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా అందరూ సోషల్ మీడియా వేదికగా హనుమంతుడికి సంబంధించి ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుకొంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ప్రత్యేక వీడియోను ఎక్స్ (ట్విట్టర్) అభిమానులతో పంచుకున్నారు. తన ఇంటిలోని పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యాన్ని ఈ వీడియోలో చూపించిన చిరంజీవి.. ‘ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడి కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుడిని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని మీతో పంచుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.
‘హనుమాన్ జయంతి సందర్భంగా మా పూజా మందిరంలో జరిగిన ఒక విశేషాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నా. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్త వర్ణాలుగా మారి మా పూజా మందిరంలో ఉన్న హనుమంతుడిని స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఇటీవల మనం అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకాంతి పడి మెరిసిన అద్భుతాన్ని చూశాం. అలాగే కోణార్క్, అరసవల్లి దేవాలయాల్లో కూడా సూర్య కిరణాలు భగవంతుడిని తాకే విశేషం అందరికీ తెలిసిందే. అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ జరిగింది. ఆ సూర్య భగవానుడు ఆంజనేయుడిని స్పృశించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా’అని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చెప్పారు మెగాస్టార్.
మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన వీడియో ఇదిగో..
అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.
మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.
జై శ్రీరామ్
జై హనుమాన్
#HanumanJayanti pic.twitter.com/fafTx4x9xL
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2026
చిరంజీవి శ్రీరామనవమి పోస్ట్..
శ్రీరామజయం….!
ఆ శ్రీరాముని అడుగుజాడల్లో నడిస్తే మనదే విజయం..!
ఈ ఏడాది శ్రీరామనవమి రోజు యాదృచ్చికంగా చరణ్ బాబు పుట్టినరోజు కలిసి రావడం ఎంతో సంతోషం.
ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో పాటు…
రాముని చరణాల వద్ద తేజోరూపూడై కొలువుండే మా ఇలవేల్పు హనుమంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని… pic.twitter.com/WPQhI2IITS
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


జై హనుమాన్