తాజావార్తలు

Actress Roja: మరో అరుదైన గౌరవం అందుకున్న రోజా కూతురు.. అన్షు ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. ఫొటోస్ వైరల్

Actress Roja: మరో అరుదైన గౌరవం అందుకున్న రోజా కూతురు.. అన్షు ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. ఫొటోస్ వైరల్


Actress Roja: మరో అరుదైన గౌరవం అందుకున్న రోజా కూతురు.. అన్షు ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. ఫొటోస్ వైరల్

ప్రముఖ నటి రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడుస్తోన్న ఆమె మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటికే తన ప్రతిభతో అంతర్జాతీయ వేదికలపై అవార్డులు, ప్రశంసలు అందుకుందీ స్టార్ కిడ్. తాజాగా అన్షు మాలిక మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ఆమెనే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏడాది క్రితం ‘బ్లూమ్ మ్యాగజైన్’ కవర్‌ పేజీపై ‘యంగ్ సూపర్ స్టార్స్’ ట్యాగ్ లో కనిపించింది అన్షు. ఇసాక్ అసారే, నిషెల్ విట్నీ వాష్ వంటి ప్రముఖులతో కలిసి ఆమె ఆ గౌరవాన్ని అందుకుంది. తాజాగా బ్లూమ్ మ్యాగజైన్ 20 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో ఆ కవర్ పేజీని ప్రదర్శించారు. తన ఫొటోను అలా ఎగ్జిబిషన్‌లో చూడటం తనకు ఎంతో గర్వంగా అనిపిస్తోందని అన్షు సంబరపడిపోతోంది. కాగా ఈ ఎగ్జిబిషన్ ను చూసేందుకు తన తండ్రి సెల్వమణితో కలిసి ఫౌంటైన్ స్క్వేర్ మాల్‌కు వెళ్లింది అన్షు. అక్కడి ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఆమె.. ‘నాన్నతో పాటు ఈ ఈవెంట్‌కు వెళ్లడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఈ క్షణాలను మరింత మధురంగా మార్చింది. ఒకప్పుడు కేవలం ఒక మైలురాయిగా అనిపించిన విషయం, ఇప్పుడు ఒక పెద్ద చరిత్రలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో నాకు అన్ని విధాలుగా సహకరించిన ఎలిజబెత్ ఎల్లిస్, రోడ్నీ మార్గిసన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని తన పోస్ట్ లో రాసుకొచ్చింది అన్షు.

ప్రస్తుతం రోజా కూతురు షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు అన్షుకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా చిన్నప్పటి నుంచే చురుకుగా ఉంటోన్న అన్షు మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటికే కొన్ని పుస్తకాలు కూడా రాసి రైటర్ గా సత్తా చాటింది. అలాగే అంతర్జాతీయ వేదికలపై ర్యాంప్ వాక్ లు కూడా చేసింది. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న అన్షు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ నేటి తరం అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తోంది.

 అన్షు మాలిక  ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Anshu (@anshuselv)

కాగా ఆ మధ్యన అన్షు పెళ్లి గురించి సామాజిక మాధ్యమాల్లో కొన్ని రూమర్లు వైరల్ అయ్యాయి. ఒక స్టార్ హీరో ఇంటికి అన్షు కోడలిగా వెళ్లనుందని తెగ ప్రచారం జరిగింది. అయితే వీటిపై స్పందించిన రోజా తన కూతురు పెళ్లి వార్తలను ఖండించింది. అన్షుకు ఉన్నత చదువు పట్ల చాలా ఆసక్తి ఉందని తెలిపింది. శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో ప్రస్తుతం అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసిస్తోందని క్లారిటీ ఇచ్చంది.

 

View this post on Instagram

 

A post shared by Anshu (@anshuselv)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *