
దినఫలాలు (ఏప్రిల్ 1, 2026): మేష రాశి వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికీ బాగుంటుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు చాలావరకు మెరుగుపడతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికీ బాగుంటుంది. ఉద్యోగంలో హోదా లభిస్తుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. పోటీదార్ల బెడద చాలావరకు తగ్గుతుంది. ప్రయత్న లోపం లేకపోతే ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అధికారులకు నమ్మకం ఎక్కువై, బరువు బాధ్యతల్ని బాగా పెంచుతారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితులు చాలావరకు మెరుగుపడతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. కోపతాపాలను బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగు తాయి. కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవు తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు బాగుంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో సానుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో చికాకు లుంటాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ నమస్యలు పరిష్కారమవుతాయి. చిన్న నాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యా ర్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగ మిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అనుకోకుండా కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీ సలహాలు, సూచనల ద్వారా లబ్ధి పొందుతారు. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలుంటాయి. రావలసిన డబ్బు చేతికి అంది, ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలు గౌరవాభిమానాలతో సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి సైతం ఊరట లభిస్తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ విస్తరిస్తుంది. వ్యాపారాలు లాభ సాటిగా పురోగమిస్తాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలుంటాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తు లతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమల్లో ముందడుగు వేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలుంటాయి. కొందరు సన్నిహితులతో అపార్థాలు తలెత్తే సూచన లున్నాయి. బంధువుల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పరిచయస్థుల్లో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించినంతగా సంపాదన పెరుగుతుంది. ఆర్థిక, ఆస్తి విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలను తీసుకోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొన్ని ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. వ్యక్తి గత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించక పోవడం శ్రేయస్కరం. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడ వద్దు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించడం జరుగుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్లో ముఖ్యమైనవి పరిష్కారం అవుతాయి. కొత్త నిర్ణయాలకు, కొత్త ప్రయ త్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపి స్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
రోజంతా హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, అనుకూలంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ప్రము ఖులతో పరిచయాలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాలకు హాజరవుతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు, చేర్పులు చేపడతారు. ఎవరితోనూ వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. కుటుంబ సభ్యుల ద్వారా ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృథా ఖర్చులు బాగా తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
