తాజావార్తలు

Jasprit Bumrah : పెళ్లి రోజున అభాసుపాలు.. భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు

Jasprit Bumrah : పెళ్లి రోజున అభాసుపాలు.. భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు


Jasprit Bumrah : పెళ్లి రోజున అభాసుపాలు.. భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు

Jasprit Bumrah : టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా మైదానంలో బ్యాటర్లకు తన యార్కర్లతో చుక్కలు చూపిస్తారు. కానీ, ఇంట్లో మాత్రం తన భార్య వేసే గూగ్లీలకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఆదివారం (మార్చి 15) బూమ్రా తన ఐదో పెళ్లి రోజును భార్య సంజన గణేషన్‌తో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక చిన్న పోస్ట్ ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. బూమ్రా తమ ఇద్దరి ఫోటోలను షేర్ చేస్తూ.. కేవలం Happy anniversary అని రెండు పదాలతో ముగించేశారు. దీనిపై ఆయన భార్య సంజన స్పందిస్తూ.. Kidney touching caption yaar(కిడ్నీని టచ్ చేసే క్యాప్షన్ భయ్యా) అంటూ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు.

సాధారణంగా పెళ్లి రోజున భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ప్రేమను కురిపిస్తూ పెద్ద పెద్ద మెసేజ్లు రాస్తుంటారు. కానీ బూమ్రా మాత్రం చాలా సింపుల్‌గా విష్ చేయడంపై సంజన ఈ సెటైర్ వేశారు. ఆమె మాత్రం తన పోస్ట్‌లో చాలా భావోద్వేగంగా రాశారు. “ప్రపంచం ఎంత గోలగా ఉన్నా, జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లినా.. మనమిద్దరం ఒకరినొకరు కౌగిలించుకుంటే అది ఇంటికి వచ్చినంత ప్రశాంతంగా ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్‌తో ఐదేళ్ల వివాహ బంధం.. ఇది నా ఫేవరెట్ స్టోరీ” అంటూ తన ప్రేమను చాటుకున్నారు.

 Jasprit Bumrah

 

 

ప్రస్తుతం బూమ్రా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ వరుసగా రెండోసారి టైటిల్ గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బూమ్రా నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నారు. వరుణ్ చక్రవర్తితో కలిసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. తన సొంత ఊరు అహ్మదాబాద్‌లో వరల్డ్ కప్ గెలవడం, ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు ఉండటం చాలా ప్రత్యేకమని ఆయన రీసెంట్‌గా బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by S A N J A N A G A N E S A N (@sanjanaganesan)

బూమ్రా, సంజన గణేషన్ 2021 మార్చి 15న గోవాలో అత్యంత రహస్యంగా వివాహం చేసుకున్నారు. అప్పట్నుంచి ఈ జంట సోషల్ మీడియాలో తమ అల్లరితో, ప్రేమతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. సంజన స్పోర్ట్స్ ప్రజెంటర్ కావడంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. తాజాగా బూమ్రాను ఆమె ట్రోల్ చేసిన తీరు చూసి నెటిజన్లు కూడా “బూమ్రా భాయ్.. గ్రౌండ్‌లో వికెట్లు పడగొట్టడం ఈజీ కానీ, సంజన గారి కౌంటర్లకు ఆన్సర్ ఇవ్వడం కష్టం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *