
Bank Deposits: 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు నిర్వహించని (ఆపరేట్ చేయని) బ్యాంక్ ఖాతాలు లేదా మెచ్యూరిటీ తర్వాత క్లెయిమ్ చేయని డిపాజిట్లను ‘అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు’ అంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం, ఈ నిధులు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (DEA) ఫండ్‌కు బదిలీ అవుతాయి. యూడీజీఏఎం (UDGAM) పోర్టల్ లేదా సంబంధిత బ్యాంక్ శాఖ ద్వారా వీటిని క్లెయిమ్ చేయవచ్చు.
దేశంలోని చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో చాలా కాలంగా డబ్బులు పేరుకుపోయాయి. వాటిని ఎవరూ క్లెయిమ్ చేయడం లేదు. చాలా కుటుంబాలు, పెట్టుబడిదారులు తమ పూర్వీకులు లేదా పాత పెట్టుబడులు ఎక్కడ చిక్కుకున్నాయో ఇంకా తెలుసుకోలేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం కొంతకాలం క్రితం ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం కింద ప్రభుత్వం లక్ష్యం ఏ కుటుంబానికి చెందిన అన్క్లైమ్డ్ డబ్బులను ఆయా కుటుంబాలకు చేర్చడం.
ఇది కూడా చదవండి: Bank Holidays: బ్యాంకుకు వెళ్తున్నారా? మీకో బిగ్ అలర్ట్.. 4 రోజులు బ్యాంకులు బంద్!
2024లో రూ. 60,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అలాగే 2025 మార్చి 31 నాటికి రూ. 74,580 కోట్లకు పెరిగాయి. 10 ఏళ్లవరకు ఎవరూ క్లెయిమ్ చేయని బ్యాంకు నిధులను అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పేర్కొంటున్నాయి బ్యాంకులు. అయితే అన్క్లెయిమ్డ్ డిపాజిట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులదే అత్యధిక వాటా ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలు సరళీకరిస్తూ RBI చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. అయితే నామినీల విషయంలో ఖాతాదారులకు అవగాహన కల్పించాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచిస్తోంది.
UDGAM పోర్టల్ ద్వారా..
బ్యాంకులలో అన్ క్లెయిమ్డ్ డబ్బును ప్రజలకు తిరిగి ఇచ్చే ప్రక్రియను సులభతరం చేయడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UDGAM పోర్టల్ ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా, ప్రజలు తమ లేదా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న పాత ఖాతాలు, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ లలో చిక్కుకున్న డబ్బు గురించి సమాచారాన్ని పొందవచ్చు. పోర్టల్ లో నమోదు చేసుకున్న తర్వాత ఏదైనా అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ కనుక్కుంటే సంబంధిత బ్యాంకు లేదా సంస్థలో డాక్యుమెంట్లు సమర్పించి డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్ ఎంతో తెలుసా?
ఇది కూడా చదవండి: Rythu Bharosa: మరికొన్ని రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు.. రైతు భరోసా పథకానికి ఇలా దరఖాస్తు చేసుకోండి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
