తాజావార్తలు

Priyamani : ఏంటీ.. ఈ స్టార్ హీరోయిన్ ప్రియమణి అక్కా.. ? ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే..

Priyamani : ఏంటీ.. ఈ స్టార్ హీరోయిన్ ప్రియమణి అక్కా.. ? ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే..


Priyamani : ఏంటీ.. ఈ స్టార్ హీరోయిన్ ప్రియమణి అక్కా.. ? ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే..

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ప్రియమణి. ఆమె ఒకప్పుడు దక్షిణాదిలో తోపు హీరోయిన్. అందం, అభినయంతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించింది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, నితిన్ వంటి స్టార్ హీరోలతో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో బ్రేక్ మాత్రం రాలేదు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించింది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలతో దూసుకుపోయింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత కూడా ప్రియమణి తన కెరీర్‌ను ఆపలేదు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో సహాయక పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా వరుస సినిమాల్లో నటిస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

ఇదిలా ఉంటే.. ప్రియమణి కుటుంబం గురించి చాలా మందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆమె అక్క కూడా సినిమా రంగంలో ప్రముఖ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్. నివేదిక ప్రకారం, ప్రియమణి, విద్యాబాలన్ కజిన్స్. వారిద్దరి తాతయ్యలు అన్నదమ్ములు. దగ్గరి సంబంధం లేకపోయినా దూరపు చుట్టాలు అని ప్రచారం. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రముఖ నటీమణులు భారతీయ చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేయడం గమనార్హం. ఒకరు దక్షిణాది పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా స్థిరపడితే, మరొకరు తన నటన కారణంగా బాలీవుడ్‌లోని స్టార్ నటీమణుల జాబితాలో ఉన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

విద్యాబాలన్.. తెలుగులో సినిమాలు చేయకపోయినప్పటికీ.. హిందీలో మాత్రం స్టార్ హీరోయిన్. హిందీలో వరుసగా విభిన్న కంటెంట్ చిత్రాలతో నటిగా ప్రశంసలు అందుకుంటుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పిస్తుంది. సిల్క్ స్మిత బయోపిక్ అంటూ వచ్చిన డర్టీ పిక్చర్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

 

View this post on Instagram

 

A post shared by Harshal Jariwala | Celebrity Makeup Artist (@harshjariwala158)

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *