తాజావార్తలు

Telangana: డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్

Telangana: డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్


Telangana: డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్

పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో భద్రాచలంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు పెట్టిన ఆర్కే షాపింగ్ మాల్ యాజమాన్యానికే కుచ్చుటోపి పెట్టి పట్టుచీరలు మాయం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు ముగ్గురు వృద్ధ మహిళలు. మహిళలకు 999 రూపాయలకు మూడు చీరలు, పురుషులకు 1+1 అఫర్, పట్టుచీరలపై ప్రత్యేక ఆఫర్లు పెట్టడంతో పక్కా ప్లాన్‌తో వచ్చిన ముగ్గురు మహిళలు రద్దీ అదును చూసి ఖరీదైన పట్టుచీరలపై కన్నేశారు. కచ్చితంగా దొరికినవి దొరికినకాడికి ఈ కన్నింగ్ మహిళలు సెలక్ట్ చేసి మరీ కొట్టేశారు.

చేతికి అందిన చీరలు మాయం చేస్తూ గంటల తరబడి కొనకుండా హడావుడి చేయడంతో సీసీ కెమెరాలు చూస్తున్న సిబ్బందికి దొరికిపోయారు. పక్కా ప్లాన్‌తో వచ్చి పర్ఫెక్ట్‌గా దొరికిన మహిళలను నిలదీయడంతో కాళ్లవేళ్లా పడుతూ దండం పెట్టడమే వారి వంతైంది. చివరకు యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకుని ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇది చదవండి: పందులు రాకుండా ఇంటి చుట్టూ వల పెడితే.. ఏవో చప్పుళ్లు వినిపించాయ్.. వెళ్లి చూడగా

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *