తాజావార్తలు

పదేళ్ల బాలికకు పెళ్లి! బాల్య వివాహం అనుకుంటే పొరపాటే.. అది దైవ సంకల్పం!! వరుడు ఎవరంటే..

పదేళ్ల బాలికకు పెళ్లి! బాల్య వివాహం అనుకుంటే పొరపాటే.. అది దైవ సంకల్పం!! వరుడు ఎవరంటే..


అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగే ఈ విశిష్ట సంప్రదాయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, దాని వెనుక ఉన్న భక్తి భావం ఎంతో గొప్పది. సాధారణంగా బాల్య వివాహం అంటే చట్టవిరుద్ధం. కానీ, ఇది దైవ కార్యంలో భాగమైన ఒక పవిత్ర వేడుక. అనంతపురం జిల్లా రాయదుర్గంలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి కళ్యాణోత్సవం ప్రత్యేక ఆకర్షణ… పదేళ్ల బాలికతో శ్రీవారి కల్యాణం జరిపించడం వందేళ్లుగా వస్తున్న ఆచారం… ప్రతి సంవత్సరం 10 ఏళ్ల బాలికకు… స్వామివారితో వైభవంగా వివాహ తంతు జరుగుతుంది.. అలాగే ఈ ఏడాది కూడా కర్ణాటక కు చెందిన పదేళ్ల చిన్నారి శ్రీ స్వర జాహ్నవి తో వెంకటరమణ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

పెళ్లికూతురిని మార్కండేయ స్వామి ఆలయం నుంచి మేళతాళాలతో రాయదుర్గం కోటలోని శ్రీవారి సన్నిధికి భక్తులు తీసుకొస్తారు. జీలకర్ర బెల్లం పెట్టించి, కన్యాదానం చేయించి, వేదమంత్రోఛ్ఛరణాల మధ్య కళ్యాణం జరుగుతుంది. పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి. అనంతరం పద్మావతి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కట్టడం వేడుకలోని ప్రధాన ఘట్టం. పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేస్తే…ఆ చిన్నారి భవిష్యత్తులో ఉత్తమ, అలాగే గుణవంతుడైన భర్త వస్తాడని భక్తుల విశ్వాసం. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు రాయదుర్గం పట్టణ ప్రజలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

బాలికతో శ్రీవారి కల్యాణోత్సవం చూసేందుకు రాయదుర్గం పట్టణం తో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పదేళ్ల బాలికతో శ్రీవారి వివాహం… ఇది వందేళ్ళ నాటి సాంప్రదాయం అంటున్నారు భక్తులు… అనాదిగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని ఆలయ అర్చకులు చెబుతున్నారు. అలాగే తమ కుమార్తెకు ఆ దేవదేవుడుతోనే కళ్యాణం జరగటం సంతోషంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *