మనుషులకే కాదు.. ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు ఆధార్ కార్డ్! ఎలా ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే?
భారతీయ పౌరులకు ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపై మనుషులకే కాదు వాహనాలకు ఆధార్ కార్డ్ ఇవ్వనున్నారు. అదేంటి విచిత్రంగా ఉందా.. అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల పూర్తి ట్రేసబిలిటీ, సమర్థవంతమైన రీసైక్లింగ్‌ను నిర్ధారించడానికి ఆధార్ లాంటి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. బ్యాటరీ తయారీదారు…
