తాజావార్తలు

Cinema : ఇదేం సినిమా మావ.. ఓటీటీని ఊపేస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. 8 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

Cinema : ఇదేం సినిమా మావ.. ఓటీటీని ఊపేస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. 8 ఏళ్లైనా తగ్గని క్రేజ్..


ఒక సాధారణ కేరమ్స్ ప్లేయర్ అయిన అన్బు (ధనుష్), తన ప్రాంతంలోని రాజకీయాలు, మాఫియా శక్తుల మధ్య ఎలా చిక్కుకున్నాడు? స్థానిక గ్యాంగ్‌ల మధ్య జరిగే పగ, ప్రతీకారాలు అతని జీవితాన్ని ఎలా మార్చేశాయి? అనే కథాంశంతో వెట్రిమారన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సస్పెన్స్, లవ్, ఎమోషన్, పొలిటికల్ డ్రామా వంటి అన్ని అంశాలను సమపాళ్లలో కుదిర్చి, ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టేలా స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారు. ఈ సినిమాలో ధనుష్ నటన వన్‌మెన్ షో అని చెప్పొచ్చు. ఆ పాత్రలో ఆయన జీవించారు. సముద్రఖని, అమీర్, ఆండ్రియా, ఐశ్వర్య రాజేష్ వంటి ప్రతి ఒక్క నటుడు తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *