భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం
రోదసి రంగంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారత్ మధ్య సహకారం మరింత బలపడుతోంది. ఇందులో భాగంగా చందమామ దక్షిణ ధ్రువంపై నిర్మించతలపెట్టిన తొలి ఆవాస ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని భారత్‌కు నాసా అధికారికంగా ఆహ్వానం పలికింది. వ్యోమగాములు నివసించడానికి, పరిశోధనలు సాగించడానికి ఈ శాశ్వత ఆవాసాన్ని నిర్మించనున్నారు. భవిష్యత్‌లో చేపట్టబోయే సుదూర అంతరిక్ష యాత్రలకు సన్నాహాలు చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇరు దేశాల పౌర అంతరిక్ష ఉమ్మడి కార్యాచరణ బృందం గత వారం…
