భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా ఉండాలి?
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో బాడీ డీ-హైడ్రేషన్ బారిన పడకుండా ఉండటం చాలా ముఖ్యం. ఈ తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం పొందేందుకు, శరీరానికి తక్షణ శక్తిని, చలవను ఇచ్చే సహజసిద్ధమైన పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజువారీగా తీసుకునే మంచినీటితో పాటు ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండే కొబ్బరిబొండం నీళ్లు, శరీర వేడిని తగ్గించే మజ్జిగ, నిమ్మరసం, సబ్జా గింజల నీళ్లు, చెరకు రసం వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి శరీరంలో కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేయడమే కాకుండా,…
