జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్న కొందరిలో బొప్పాయి వికటించే అవకాశం లేకపోలేదు. బొప్పాయి తీసుకున్న తర్వాత కొందరికి కడుపుబ్బరం, తీవ్రమైన అసౌకర్యం, ఎసిడిటీ లేదా గుండెల్లో మంట వంటి జీర్ణ సంబంధిత ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటి వారు దీని వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం లేదా కొన్నాళ్లపాటు బొప్పాయికి దూరంగా ఉండటం మంచిది. ఇక బొప్పాయి కేవలం శరీర వేడిని పెంచుతుందనే ప్రచారానికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, వ్యక్తిగత అసౌకర్యాన్ని గమనిస్తూ ఉండటం అవసరం.
