తాజావార్తలు

RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే


హైదరాబాద్‌, అక్టోబర్ 18: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక సమాచారం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) పారామెడికల్ కేటగిరీల్లో భర్తీకి నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) తేదీలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేశాయి. CEN 05/2026 నోటిఫికేషన్‌ కింద ఈ పరీక్షలను నవంబర్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు 2026 అక్టోబరు 18న విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పారామెడికల్ పోస్టులకు సంబంధించిన CBT పరీక్షలు 2026 నవంబర్ 23, 25 తేదీల్లో జరగనున్నాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష తేదీలు, పరీక్ష కేంద్రం వివరాలు, హాల్‌టికెట్‌ విడుదలకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్లలో పరిశీలించాలి.

పరీక్ష నగరం, తేదీ వివరాలు ఎప్పుడంటే?

అభ్యర్థులు పరీక్ష రాసే నగరం, తేదీ వివరాలను తెలుసుకునేందుకు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ప్రయాణ అనుమతి పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు సంబంధించిన లింక్‌ను పరీక్ష తేదీకి సుమారు 10 రోజుల ముందు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ వివరాలను RRB అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు. పరీక్షకు సంబంధించిన ఈ-కాల్ లెటర్లు (హాల్‌టికెట్లు) పరీక్ష నగరం, తేదీ సమాచార లింక్‌లో పేర్కొన్న పరీక్ష తేదీకి సుమారు నాలుగు రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి



ఆధార్‌ బయోమెట్రిక్‌ ధ్రువీకరణ తప్పనిసరి

పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు అభ్యర్థులకు ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ ధ్రువీకరణ నిర్వహించనున్నారు. అందువల్ల అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు లేదా ఈ-వెరిఫై చేసిన ఆధార్‌ ప్రింట్‌ఔట్‌ను వెంట తీసుకెళ్లాలి. దరఖాస్తు సమయంలోనే ఆధార్‌ను ధ్రువీకరించిన అభ్యర్థులు కూడా పరీక్షకు వెళ్లే ముందు UIDAI వ్యవస్థలో తమ ఆధార్‌ అన్‌లాక్‌ స్థితిలో ఉందో లేదో నిర్ధారించుకోవాలని బోర్డులు సూచించాయి. ఆధార్‌ వివరాల్లో పదో తరగతి సర్టిఫికెట్‌ ప్రకారం పేరు, పుట్టిన తేదీ, తాజా ఫొటో, చిరునామా, తండ్రి పేరు సరిగ్గా ఉండాలి. 15 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేయకపోతే, వాటిని నవీకరించుకోవాలి. పారామెడికల్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక RRB వెబ్‌సైట్లను మాత్రమే అనుసరించాలని బోర్డులు సూచించాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తప్పుడు హామీలు ఇచ్చే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. రైల్వే నియామకాలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అభ్యర్థుల మెరిట్‌ ఆధారంగానే జరుగుతాయని స్పష్టం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *