Telangana: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్.. ఎందుకంటే..?
తెలంగాణలో జులై 14, మంగళవారం రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్కు అఖిల భారత విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేసి, ఈ బంద్ను విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ABVP ప్రకటించింది. రూ. 11,000 కోట్ల బకాయిలు.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం!…
