Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..
టాలీవుడ్ నటుడు అరుంధతి అరవింద్ తన సినీ ప్రస్థానం, ముఖ్యంగా అరుంధతి సినిమాతో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన అనుభవాలను, స్నేహాల గొప్పతనాన్ని, అలాగే తన కెరీర్‌లోని కీలక మలుపులను వివరించారు. అరవింద్ తన కెరీర్‌లో అరుంధతి సినిమాకున్న ప్రాముఖ్యతను చెప్పారు. దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్టులో సోనూసూద్ పోషించిన పసుపతి పాత్ర కోసం…
