Sridhar Reddy: రొట్టెల పండుగ సాక్షిగా.. నెల్లూరు రూరల్ పొలిటికల్ సస్పెన్స్‌కు తెరదించిన కోటంరెడ్డి!
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక నెల్లూరు రొట్టెల పండుగలో ఒక ఆసక్తికర రాజకీయ ఘట్టం చోటుచేసుకుంది. ఏటా ఐదు రోజుల పాటు రాష్ట్ర పండుగగా ఎంతో వైభవంగా జరిగే ఈ వేడుకల్లో.. ఈసారి రాజకీయ ఊహాగానాలకు తెరదించేలా ఒక పరిణామం కనిపించింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు తమ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ‘ఎమ్మెల్యే రొట్టె’ అందించడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే ఈ…
