EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం.. ప్రాసెస్ సింపుల్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో ఈపీఎఫ్‌వో 3.0 ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా యూపీఐ, ఏటీఎం ద్వారా నేరుగా పీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా త్వరలో ఈ కొత్త ప్లాట్‌ఫామ్ గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పీఎఫ్ సంస్థ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందుకోసం జూన్ 30వ తేదీ వరకు యూఏఎన్ పోర్టల్, ఉమాంగ్ యాప్‌లో సేవలను…
