Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఏపీ, తెలంగాణకు రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు మరోసారి వర్ష సూచనలు జారీ చేశాయి. వాయువ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో నేడు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతవారణ శాఖ తెలిపింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. ఆదివారం ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని,…
