టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
మైనర్ల ChatGPT ఖాతాలకు ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు భద్రతా చర్యలను ఈ టీన్ మోడ్లో మరింతగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆత్మహత్య, స్వీయహాని, హింస, ఈటింగ్ డిజార్డర్స్, గ్రాఫిక్ లైంగిక కంటెంట్ వంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన చాటింగ్పై కఠినమైన పరిమితులు ఉంటాయి. టీనేజర్ల కోసం రూపొందించిన వెర్షన్లో తరచూ విరామం తీసుకోవాలని గుర్తుచేసే Break Reminders ఉంటాయి. అలాగే నిర్దిష్ట సమయాల్లో ChatGPT వినియోగాన్ని నిలిపివేసే Quiet Hours సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది….
