తాజావార్తలు

మేయర్ కాదు.. మోసగత్తె! ప్రజాధనం కొట్టేసేందుకు ఎంత డ్రామా.. మహానటులు కూడా పనికిరారు

మేయర్ కాదు.. మోసగత్తె! ప్రజాధనం కొట్టేసేందుకు ఎంత డ్రామా.. మహానటులు కూడా పనికిరారు


మేయర్ కాదు.. మోసగత్తె! ప్రజాధనం కొట్టేసేందుకు ఎంత డ్రామా.. మహానటులు కూడా పనికిరారు

మెక్సికోలోని టెనాన్సింగో పట్టణ మేయర్ నాన్సీ నాపోల్స్ చుట్టూ సంచలన వివాదం నెలకొంది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కాజేయాలనే ఉద్దేశంతో ఆమె కిడ్నాప్‌ నాటకానికి తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కొందరు సాయుధ వ్యక్తులు ఆమెను తుపాకీతో బెదిరించి అపహరించినట్లు సమాచారం వెలువడింది. అనంతరం కిడ్నాపర్లు ఆమె విడుదల కోసం 2.3 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.18 కోట్లకు పైగా) డిమాండ్‌ చేసినట్లు వెల్లడైంది. డబ్బు చెల్లించకపోతే మేయర్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బెదిరించినట్లు అధికారులు తెలిపారు.

ఒక వ్యక్తి అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి మేయర్‌ను సురక్షితంగా రక్షించారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారి వాంగ్మూలాల్లో అనేక విరుద్ధతలు బయటపడినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ కిడ్నాప్‌ వ్యవహారం ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం జరిగిన డ్రామా అని అనుమానాలు బలపడుతున్నాయి. దర్యాప్తు సంస్థల ప్రకారం.. మేయర్ విడుదల కోసం ప్రైవేట్‌ నిధులు సమకూరకపోతే ప్రభుత్వ నిధులను ఉపయోగించాలని ఆమె బంధువులు సూచించినట్లు ఆధారాలు లభించాయని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని అక్రమంగా వినియోగించేందుకు కిడ్నాప్‌ కథ అల్లినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ప్రస్తుతం మేయర్‌పై ఎలాంటి అరెస్ట్‌ వారెంట్‌ జారీ కాలేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఆమె భర్తతో పాటు మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు జులై 9న మేయర్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రాసిక్యూషన్‌ కోర్టును కోరింది. ఇక ఈ ఆరోపణలన్నింటినీ నాపొలిస్‌ ఖండించారు. ఇవి రాజకీయ ప్రత్యర్థులు ప్రేరేపించిన ఆరోపణలేనని ఆమె పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులతో పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన మెక్సికో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *