Solar Eclipse: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి అలర్ట్! ఆర్థిక, కుటుంబ సమస్యలు పెరిగే సూచనలు!
ఆగస్టు 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది 2026 సంవత్సరంలోని చివరి సూర్యగ్రహణం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాధారణంగా సూర్యగ్రహణం అంటేనే చాలా మందిలో భయం, సందేహాలు, జ్యోతిష్య ప్రభావాలపై చర్చ మొదలవుతుంది. గ్రహణం సమయంలో ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తుంటాయి. అయితే, ఖగోళ శాస్త్రవేత్తలు, జ్యోతిష్య నిపుణుల సమాచారం ప్రకారం, ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల భారతదేశంలో దీనికి సంబంధించిన సూతక కాలం లేదా…
