Gold Rates: భగ్గుమన్న బంగారం ధరలు.. గంటల్లోనే మారిన లెక్కలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. అమెరికన్ డాలర్ విలువ పెరగడంతో పాటు 10 సంవత్సరాల బాండ్ల రాబడులు పెరిగాయి. దీంతో పాటు జూలైకి సంబంధించిన అమెరికా ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు గోల్డ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో వివిధ నగరాల్లో ఆగస్ట్ 13న ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు…
