ప్రభుత్వంతో ఫలించని చర్చలు.. తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
ఏపీలో జూనియర్ డాక్టర్ నిరసన రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ప్రభుత్వ నిబంధనలు, జీవో ప్రకారం తమ స్టైఫండ్‌ను 30 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసన రెండో రోజుకు చేరుకుంది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో కనీసం 15 శాతమైనా పెంచాలని జాడాలు విజ్ఞప్తి చేసినప్పటికీ.. అటు ప్రభుత్వం నుంచి మాత్రం సానుకూల స్పందన రావడం లేదు. దీంతో తమ ఆందోళనను మరింత ఉదృతం చేస్తామంటున్నారు జూనియర్ డాక్టర్లు. ఫలించని…
