Video: అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి..
దొంగతనం అనగానే సాధారణంగా చీకట్లో ముసుగు వేసుకుని, పట్టుబడిపోతామనే భయంతో చప్పుడు కాకుండా క్షణాల్లో సొత్తు ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఈ దొంగతనం చూస్తే మాత్రం పోలీసులతో సహా ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఒక దొంగ ఆటోమోబైల్ షోరూమ్‌లో ఏకంగా సాడేనాలుగు గంటల పాటు తిష్టవేశాడు. హాయిగా కాఫీ తాగాడు, వాష్‌రూమ్‌లో స్నానం చేశాడు, పాటలు పెట్టుకుని మరీ లుంగీ డ్యాన్స్ చేశాడు. చివరికి షోరూమ్ మేనేజర్‌కు చెందిన రూ.4.71 లక్షల విలువైన…
