కాకినాడలో దారుణం.. గోదావరిలో దూకి AE కుటుంబం మాస్ సూసైడ్!
రాజమహేంద్రవరం, ఆగస్ట్ 18: కాకినాడ అశోక్నగర్కు చెందిన తిల్లపూడి నూకరాజు (61) పిఠాపురం మండలంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్నారు. సుమారు పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆయన వచ్చే జనవరిలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆదివారం అర్ధరాత్రి భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (38), మనుమడు రియాన్ష్ కార్తికేయరెడ్డి (10)తో కలిసి కారులో రాజమహేంద్రవరం వచ్చారు. రాజమహేంద్రవరం రైలు వంతెనపై కారు నిలిపిన అనంతరం నలుగురూ గోదావరిలోకి దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న…
