Viral Video: ఇలాంటి చోరీ ఎప్పుడూ చూసుండరు.. రెప్పపాటులో రూ.10లక్షల బంగారం ఎత్తుకెళ్లిన మహిళ!
సంగారెడ్డి జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. బంగారం కొంటామని షాప్కు వచ్చిన మహిళలు రెప్పపాటులో రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం జహీరాబాద్లోని ఒక గోల్డ్ షాప్కు బంగారం కొందామని బురఖాలు ధరించిన నలుగురు మహిళలు వచ్చారు. ముక్కుపుడకలు చూపించాలని సదరు షాప్ సిబ్బందిని అడిగారు. దీంతో షాప్లో ఉన్న సిబ్బంది వాళ్లకు అక్కడ ఉన్న డిజైన్లు చూపించడం మొదలుపెట్టారు. ఇలా ఆ మహిళలు మాటలతో దుకాణ…
