All in One App: డిజిటల్ వేదికపైకి ప్రజారవాణా సేవలు.. ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్లో..!
All in One App: ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోన్న టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించింది. ప్రయాణికులకు వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు మీసేవ ద్వారా వినూత్నంగా మీటికెట్ ((MeeTicket) యాప్ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్ను రూపొందిస్తున్నారు. ఆర్టీసీ,మెట్రో ,ఆటోలు, క్యాబ్స్ వంటి అన్ని ప్రధాన రవాణా వ్యవస్థలు ఈ…
