భారత్‌కు ఊహించని షాక్.. దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం.. సెమీస్ ఆశలపై ఎఫెక్ట్..?
మహిళల ప్రపంచకప్ వేదికపై భారత క్రికెట్ అభిమానులకు తీరని నిరాశ ఎదురైంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన గ్రూప్ ఏ లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు చేతిలో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. లంకపై మన కుర్రాళ్లు సృష్టించిన పరుగుల పండగను మరువక ముందే మహిళల జట్టు ఇలా చేతులెత్తేయడం అభిమానులను కలచివేస్తోంది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో తడబడిన భారత బ్యాటింగ్.. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో గ్రూప్ ఏ లో భాగంగా జరిగిన 18వ మ్యాచ్‌లో…
