94 ఏళ్ల వృద్ధురాలి మనసు మళ్లీ మాతృభూమి వైపు.. భారత పౌరసత్వం కోసం మహాలక్ష్మమ్మ వినతి
జీవితంలో ఎన్నో మలుపులు తిరిగినా చివరికి పుట్టిన నేలే తనకు శాశ్వత నిలయమని భావించిన 94 ఏళ్ల వృద్ధురాలు ఇప్పుడు భారత పౌరసత్వం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన మహాలక్ష్మమ్మ తన జీవిత చరమాంకాన్ని మాతృభూమిలోనే గడపాలనే సంకల్పంతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేశారు. మహాలక్ష్మమ్మ 1993లో భర్త మరణానంతరం తన కుమారుడి వద్ద ఉండేందుకు అమెరికాకు వెళ్లారు. అనంతరం అక్కడే స్థిరపడటంతో 2000…
