Shreyas Iyer : కివీస్‌కు ఇక చుక్కలే..టీమిండియాలోకి ఆ ఖతర్నాక్ బ్యాటర్ ఎంట్రీ ఫిక్స్..ఫిట్‌నెస్ రిపోర్ట్ వచ్చేసింది
Shreyas Iyer : భారత వన్డే జట్టులో కీలక ఆటగాడైన శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. గత కొంతకాలంగా గాయంతో సతమతమవుతున్న అయ్యర్, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి న్యూజిలాండ్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో అయ్యర్ పేరు ఉన్నప్పటికీ, ఆయన ఆడటం అనేది ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని సెలక్టర్లు అప్పట్లో స్పష్టం చేశారు. తాజా సమాచారం ప్రకారం, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఆయన రిహాబిలిటేషన్ ప్రక్రియ…
