తాజావార్తలు

Tollywood : కనకదుర్గమ్మ అమ్మవారిలా టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ? పోస్టర్ అదిరిపోయిందిగా..


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. మంచి క్రేజ్ ఉన్న టైంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఆమె నటిస్తున్న లేటేస్ట్ మూవీ ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’. అమ్మవారిలా ఉన్న హీరోయిన్ మరెవరో కాదు.. ఒకప్పటి హీరోయిన్ లయ. ఒకప్పడు తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన లయ, ఇప్పుడు ఈ చిత్రంతో మరోసారి వెండితెరపై ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దుర్గ ఫణిదర్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, అడ్వెంచర్ జానర్‌తో పాటు నిధి అన్వేషణ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..

దసరా పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో నటి లయ ఎంతో పవర్‌ఫుల్‌గా అమ్మవారి అవతారంలో కనిపిస్తుండటం విశేషం. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అశ్వనీదత్, స్వప్న దత్ విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి రూపంలో లయ కనిపించే తీరు , ఆమె గెటప్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.

ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?

రాగా మూవీస్ , తిలోత్తమ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వాణి శంకర్, తిలోత్తమ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శశిధర్ లంక సంగీతం అందిస్తున్నారు. కథాంశం పరంగా వైవిధ్యంగా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ , ఇతర అప్డేట్లను మేకర్స్ త్వరలోనే వరుసగా ప్రకటించనున్నారు. లయ ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులలో మంచి ఆసక్తి నెలకొంది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

హీరోయిన్ లయ..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *