తాజావార్తలు

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు..


Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు..

తమిళనాడు తీరానికి సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం అక్టోబర్ 21న వఉదయం 08:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. థాయిలాండ్ గల్ఫ్, దానిని ఆనుకుని ఉన్న థాయిలాండ్, మయన్మార్ ప్రాంతాల్లో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం అక్టోబర్ 21వ తేదీన ఉదయం 08:30 గంటలకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనగుతున్నది. ఇది ఈరోజు (అక్టోబర్ 21) ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తుంది. దీని ప్రభావంతో అక్టోబర్ 23, 2026 ప్రాంతంలో ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది వాయవ్య దిశగా కదులుతూ తదుపరి 3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీర ప్రాంతంలోని అల్పపీడన కేంద్రం నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు, సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ఇప్పుడు తక్కువగా గుర్తించబడినది. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను వాతావరణశాఖ జారీ చేసింది.

మూడ్రోజుల పాటు వర్షాలు

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటినుండి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల గరిష్టముగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణకు వర్షసూచన

నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు (అక్టోబర్ 21, 2026) ఉదయం 05:30 గంటలకు అదే ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈరోజు ఉదయం 08:30 గంటలకు కూడా అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంలోని అల్పపీడన కేంద్రం నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్, దానిని ఆనుకుని ఉన్న థాయ్‌లాండ్, మయన్మార్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు అక్టోబర్ 21 ఉదయం 08:30 గంటలకు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. ఇది ఈరోజు అక్టోబర్ 21 నాటికి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుంది. దీని ప్రభావంతో 2026 అక్టోబర్ 23 నాటికి ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది వాయువ్య దిశగా కదిలి తదుపరి 3 రోజుల్లో మరింత తీవ్రపడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడ్రోజలు పాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *