తాజావార్తలు

Tamil Politics: స్టాలిన్‌ను పొగడ్తలతో ముంచేస్తున్న విజయ్ పార్టీ

Tamil Politics: స్టాలిన్‌ను పొగడ్తలతో ముంచేస్తున్న విజయ్ పార్టీ


Tamil Politics: తమిళనాడులో రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఏ నిమిషం ఏమి జరుగుతుందో ఎవరు ఊహించలేని పరిస్థితి.. తమిళనాడు రాజకీయాల్లో ఇలా ఎప్పటికీ జరగవు అనుకున్నవి కూడా జరగబోతున్నాయి అన్న చర్చ జరుగుతోంది. విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలతో సింగల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 స్థానాల్లో అవసరం. కాంగ్రెస్ పార్టీ డిఎంకె కూటమి నుంచి బయటికి వచ్చి విజయ్ కు మద్దతు ఇవ్వడంతో టీవీకే బలం 112 కు చేరింది.

అయితే ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. అవసరమైన సంఖ్యాబలంతో వస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేనని ఇంచార్జి గవర్నర్ అర్లేకర్ తేల్చి చెప్పేశారు. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు విజయ్ గవర్నర్ ను కలిసి అసెంబ్లీలో బల నిరూపణ చేస్తానని చెప్పినా కూడా అనుమతి రాలేదు. దీంతో ఒకటి రెండు స్థానాల్లో విజయం సాధించిన చిన్న పార్టీలను నమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒక దశలో డిఎంకె అన్న డీఎంకే కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. అదే ఈ విషయాన్ని స్టాలిన్ ఖండించారు.

విజయం ప్రభుత్వ ఏర్పాటు కాకుండా మేము అడ్డుకోమని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు సిపిఐ సిపిఎం విసికే పార్టీల వద్ద ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు మద్దతి ఇస్తే విజయ్ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంటారు. కామపక్షాలను వీసీకే పార్టీని విజయ పార్టీ మద్దతు కోరింది. అయితే ఈ మూడు పార్టీలు ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్నాయి. మూడు పార్టీలు స్టాలిన్స సమావేశమై విజయ్ పార్టీ మద్దతు కోరిన విషయమై చర్చించారు. అందుకు స్టాలిన్ సానుకూలంగా స్పందించి టీవీ కేకు మద్దతు ఇచ్చే విషయంలో మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

దీంతో వామపక్షాలు వీసీకే పార్టీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని విజయ్ కు మద్దతు ఇచ్చే అంశంలో అధికారిక ప్రకటన చేయనున్నారు. స్టాలిన్ నిర్ణయాన్ని విజయ పార్టీలో ఉన్న కార్యకర్తలు ముఖ్య నేతలు పొగడ్తలతో ముంచేస్తున్నారు.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరికీ సాధ్యం కాదని స్టాలెండి పెద్ద మనసు అంటూ సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Air Cooler: కూలర్ నుండి చేపల వాసన వస్తోందా? కేవలం ఈ ఒక్క వస్తువుతో మీ గదిని సువాసనలతో నింపేయండి!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *