తాజావార్తలు

Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!

Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!


నటి తళ్లూరి రామేశ్వరి.. ఈ పేరు చెప్తే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ ఆమెను చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..  తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన కెరీర్, కుటుంబం, మహేష్ బాబుతో జరిగిన ఓ సంఘటన గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. చాలా సంవత్సరాల తర్వాత సినిమాలోకి తిరిగి రావడానికి కారణం దర్శకుడు తేజ అని రామేశ్వరి తెలిపారు. తన తల్లి మరణానంతరం ఏర్పడిన శూన్యతను నింపుకోవడానికి పని చేయాలని కోరుకుంటున్న సమయంలోనే తేజ నుంచి నేరుగా ఫోన్ వచ్చిందని ఆమె వివరించారు. ఫలానా రోల్ ఉంది, చేస్తారా.? చేస్తే మీ ఇష్టం, బాగుంటది, లేకుంటే మీ ఇష్టం” అంటూ తేజ తనను సంప్రదించినట్లు పేర్కొన్నారు. ఈ పాత్రను ముందుగా రేఖ, జయసుధ వంటి ప్రముఖ నటీమణులకు ఆఫర్ చేయగా, పాత్రకు శారీరక శ్రమ ఎక్కువ కావడంతో వారు నిరాకరించారని రామేశ్వరి చెప్పారు. అయితే, తాను మాత్రం ఆ పాత్రలోని సారాంశాన్ని మాత్రమే చూశానని, హీరో ఎవరనేది పట్టించుకోలేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్

సినిమా షూటింగ్ సమయంలో పారితోషికం విషయంలో మహేష్ బాబుతో జరిగిన ఓ సంఘటనను రామేశ్వరి గుర్తుచేసుకున్నారు. తాను తక్కువ పారితోషికం తీసుకోవడంపై మహేష్ బాబు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, “ఏంటి ఇంత తక్కువ డబ్బు చేశారు మీరు.? అసలు మీకు ఏమైనా అడిగే మాట లేదా?” అంటూ తనను ప్రశ్నించారని వెల్లడించారు. తాను పెద్ద మొత్తాలు అడగడాన్ని సమంజసంగా భావించనని, “డీసెంట్ మనీ” మాత్రమే కోరుకుంటానని, తన కోసం ఎవరూ ఆస్తులు అమ్ముకోవద్దని ఆమె వివరించారు.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..

విజయశాంతి వంటి వారికి కోటి రూపాయలు ఇవ్వడం వేరు, తనకు అంత ఇవ్వాలని అడగడం తన దృష్టిలో అర్థం లేదని ఆమె అన్నారు. పాత్ర ఎంపిక గురించి తేజను అడగ్గా, “మీరు ఎలా గుర్తొచ్చారో నేను ఇప్పుడు చెప్పలేను కానీ మిమ్మల్ని మేము మర్చిపోలేదు” అని సమాధానం ఇచ్చారట. సీతామహాలక్ష్మి క్యాసెట్ చూస్తూ రంగీలా స్క్రిప్ట్ రాశామని, రామేశ్వరి ముంబైలో ఉన్నప్పటికీ ఆమెకు ఆ సినిమా ఇంపాక్ట్ తెలుసని తేజ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో తాను డైలాగులు బాగా కంఫర్టబుల్‌గా చెప్పేంతవరకు అనేక రీటేకులు తీసుకుంటానని, పాత్రలో పూర్తిగా లీనమైపోయేందుకు ప్రయత్నిస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ పర్ఫెక్షన్ కారణంగా మహేష్ బాబుతో పాటు యూనిట్‌లోని ఇతర సభ్యులు తనపై కామెంట్ చేసేవారని, అయినప్పటికీ తాను రాజీ పడకుండా పని చేశానని తళ్లూరి రామేశ్వరి వివరించారు.

ఇది కూడా చదవండి :నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *