పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..? అలా వేశాక నేలలో ఏం జరుగుతుంది..?
వ్యవసాయం ప్రారంభమైన నాటి నుంచి రైతులు పశువుల పేడను ఎరువుగా ఉపయోగిస్తున్నారు. నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయన ఎరువులు విస్తృతంగా వాడుతున్నప్పటికీ, పేడకు ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే పేడ కేవలం మొక్కలకు పోషకాలను అందించే ఎరువు మాత్రమే కాదు.. నేల ఆరోగ్యాన్ని కాపాడే సహజ వనరు కూడా. ఒక పంట బాగా పండాలంటే విత్తనం, నీరు, ఎరువులు ఎంత ముఖ్యమో.. నేల ఆరోగ్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఆ నేలకు తిరిగి జీవాన్ని…
