Tirumala: రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈనెల 25న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. రథసప్తమి రోజున ఏడు వాహనసేవలపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై.. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో వాహనసేవలు ముగుస్తాయన్నారు. రథసప్తమి వేడుకలకు దాదాపు రెండు లక్షల 50వేల మంది వస్తారని అంచనా వేశారు. ఈ రద్దీ దృష్ట్యా తిరుపతిలో…
