టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కదిరేపల్లికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంపై ఉన్న సెల్ టవర్‌ను ఎక్కి హల్‌చల్ చేశాడు. సెల్ టవర్‌పై వ్యక్తిని గమనించిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లక్ష్మీనారాయణ టిడిపి జెండా పట్టుకుని సెల్ టవర్ ఎక్కడంతో స్థానికులు ఏమై ఉంటుందా అని చర్చించుకున్నారు. లక్ష్మీనారాయణ తన కుమార్తె విషయంలో న్యాయం జరుగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ సెల్ టవర్ పైకి…
