అది ఇది వద్దు.. ఉదయాన్నే ఇది ఒక్క గ్లాస్ తాగండి చాలు.. ఆ రోగాలు హాంఫట్..
ఆధునిక జీవనశైలిలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ముఖ్యంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బుల ప్రమాదం గణనీయంగా పెరుగుతోంది.. అయితే, ఒక వ్యాధి రావడం అనేది మెరుగైన జీవనశైలి లేకపోవడానికి సూచనగా పరిగణించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీవనశైలితోపాటు ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉండి, శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేస్తుంటే, వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే, అనేక జబ్బులను మందులు, శస్త్రచికిత్సలు లేకుండానే…
