Peddi Movie: ‘ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు’
ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు. ఎంత అణచాలని చూస్తే అంత విస్పోటనం అవుతాడు. గురిపెట్టిన లక్ష్యం వైపు ఎంతో ఓపికగా అడుగులు వేస్తాడు. ఎత్తు పల్లాలు ఎదురైనా..తన కష్టంతో ముందుకెళతాడు. చుట్టూ ఉన్న వాళ్లు నోటికొచ్చినట్టు వాగినా పట్టించుకోడు. విమర్శలతో దాడి చేస్తే తన గెలుపుతో తిప్పికొడతాడు. గేలి మాటలతో ఎగతాళి చేస్తే తన విజయంతో సమాధానమిస్తాడు. చివరికి అనుకున్నది సాధించి.. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటాడు. పెద్ది సినిమాలో పెద్దిగాడి తీరిది. సర్‌ప్రైజింగ్‌లీ…
