Mrigasira Karte: మృగశిర కార్తె వచ్చేసింది.. తొలకరి జల్లులు, చేపల సంప్రదాయం వెనుక ఉన్న రహస్యమేమిటి?
Mrigasira Karte Begins: రోహిణి కార్తెలో భానుడి ప్రతాపానికి భూమి అగ్నిగుండంలా మారిపోతుంది. రోళ్లు సైతం పగిలిపోయేంత ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అలాంటి మండుటెండలకు ముగింపు పలుకుతూ, ప్రకృతికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చేది మృగశిర కార్తె. ఈ కార్తె ప్రారంభమవుతుందంటే చాలు.. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయి, తొలకరి చినుకులు నేలను తడుపుతాయి, రైతుల కళ్లలో ఆశలు చిగురిస్తాయి. తెలుగు సంప్రదాయంలో మృగశిర కార్తెకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వర్షాకాలానికి స్వాగతం పలికే ఈ కాలం వ్యవసాయంతో…
