Harsha Vardhan: మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అయితే నటుడు హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటిస్తే మంచిది
ప్రముఖ నటుడు హర్షవర్ధన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమృతం సీరియల్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారీ ట్యాలెంటెడ్ నటుడు. అందులో గుండు హనుమంతరావుతో కలిసి హర్షవర్ధన్ చేసిన కామెడీని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. దీంతో పాటు శాంతి నివాసం, కస్తూరి తదితర సూపర్ హిట్ సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు హర్షవర్ధన్. సీరియల్స్ తో పాటు కొండవీటి సింహాసనం, ఐతే, అతడు, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి…
