EPFO: పీఎఫ్ ఖాతాదారులకు సూపర్ న్యూస్.. అకౌంట్లలో వడ్డీ జమ అయ్యేది అప్పుడే.. క్లారిటీ వచ్చేసింది..
పీఎఫ్ ఉద్యోగులకు శుభవార్త. వడ్డీ అకౌంట్లలో ఎప్పుడు పడుతుందనే విషయంపై క్లారిటీ వచ్చింది. పీఎఫ్ వడ్డీని ఈ ఏడాది మార్చిలో ఈపీఎఫ్‌వో ఖరారు చేసింది. మూడు నెలలు గడుస్తున్నా ఇంకా అకౌంట్లలో జమ కాలేదు. దీంతో వడ్డీ డబ్బులు ఎప్పుడు వస్తాయా? అని ఖాతాదారులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకుంటున్నారు. జూన్ నెల కూడా మరికొద్ది రోజుల్లో ముగియనుండటంతో.. త్వరలోనే పీఎఫ్ వడ్డీ జమ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఎప్పుడు…
